కరోనా వైరస్ మహమ్మారి ముక్కు ద్వారా మెదడులోకి కూడా చొరబడుతుందట!

30-11-2020 Mon 22:07 | Science
  • లక్షల మందిని కబళించిన కరోనా
  • మెదడులోనూ వైరస్ ఆవాసం
  • దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ
  • నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం
ఏడాది కాలంగా ఉనికిని చాటుకుంటున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షల ప్రాణాలను బలిగొంది. అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ మహమ్మారి కోట్ల మందికి సోకింది. తాజాగా ఈ వైరస్ పై ఓ ఆసక్తికర అధ్యయనం వెలువడింది. కొవిడ్ ముక్కు ద్వారా మెదడులోకి కూడా ప్రవేశిస్తుందని జర్మనీ పరిశోధకులు గుర్తించారు. కొందరు కరోనా రోగుల్లో నరాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నవుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అధ్యయనం నేచర్ న్యూరోసైన్స్ జర్నల్ లో ప్రచురితమైంది.

సార్స్ కోవ్-2 కేవలం శ్వాస వ్యవస్థనే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని, తత్ఫలితంగా రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం, నరాలకు సంబంధించిన సమస్యలు కలుగుతాయని పేర్కొన్నారు.  

కాగా, ఇటీవలి ఓ అధ్యయనంలో... మెదడులోనూ, సెరెబ్రోస్పైనల్ ద్రవాల్లోనూ వైరస్ కు సంబంధించిన ఆర్ఎన్ఏ ఉన్నట్టు గుర్తించినా, వైరస్ ఎలా ప్రవేశిస్తోందీ.. మెదడులోపలి భాగాల్లో ఎలా పాకిపోతోంది? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే  ఇది ముక్కు ద్వారానే మెదడులో చొరబడుతోందన్న విషయం తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.

గొంతు పైభాగంలో ఉండే నాసికాగ్రసనిలో తొలిస్థావరం ఏర్పరచుకుంటున్న కరోనా రక్కసి, అక్కడి నుంచి నాసికా కుహరం ద్వారా మెదడులోకి పాకుతోందని తెలుసుకున్నారు. కరోనాతో మరణించిన 33 మంది రోగులపై పరిశోధనలు చేసి ఈ వివరాలు గుర్తించారు. కాగా, కరోనా వైరస్ కు సంబంధించిన జన్యుపదార్థం ఆర్ఎన్ఏ... ఘ్రాణ శ్లేష్మ పొరలో అత్యధిక పాళ్లలో ఉన్నట్టు జర్మనీ పరిశోధకులు కనుగొన్నారు.
Corona VirusBrainNoseRNAGermany

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more